ప్రారంభమైన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర

Minister Mekapati Gautam Reddys funeral March Started
షార్ట్స్‌లో చూడండి
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. నెల్లూరులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ యాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి చేరుకుంటుంది. అనంతరం అక్కడి మేకపాటి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్) సమీపంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారు. అంతిమయాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Go Back to Shorts
Mekapati Goutham Reddy
Last Rites
Nellore District
YS Jagan

More Telugu News