deepak chahar: శ్రీ‌లంక‌తో సిరీస్‌కు చాహ‌ర్ దూరం

deepak Chahar out from series with Sri Lanka
షార్ట్స్‌లో చూడండి
శ్రీలంకతో సిరీస్‌కు ముందు టీమిండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ దీపక్ చాహర్ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. ఇప్ప‌టికే అత‌డు బ‌యోబ‌బుల్‌ను వీడాడ‌ని స‌మాచారం. లంక‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో చాహ‌ర్ స‌భ్యుడిగా ఉన్నాడు.

వెస్టిండీస్‌తో ఆఖ‌రి టీ20 సంద‌ర్భంగా చాహ‌ర్‌ గాయ‌ప‌డిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రెండో ఓవ‌ర్ బౌలింగ్ చేస్తుండ‌గా కుడి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో చాహ‌ర్ మైదానాన్ని వీడాడు. వైద్యుల ప‌రీక్ష అనంత‌రం గాయం తీవ్ర‌మైంద‌ని తేలింది. కోలుకునేందుకు 5-6 వారాలు ప‌డుతుంద‌ని వైద్యులు చెప్పిన‌ట్లుగా స‌మాచారం.

లంక‌తో టీ20 సిరీస్ ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ప్రారంభం కానుంది. లక్నో వేదిక‌గా తొలి టీ20, ఫిబ్ర‌వ‌రి 26, 27 తేదీల్లో ధ‌ర్మ‌శాల వేదిక‌గా రెండు, మూడు టీ20లు జ‌ర‌గ‌నున్నాయి. అనంత‌రం మార్చి 4-8 వ‌ర‌కు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వ‌ర‌కు బెంగ‌ళూరు వేదిక‌గా రెండో టెస్టు(డే అండ్ నైట్) జ‌ర‌గ‌నుంది.
Go Back to Shorts
deepak chahar
team india
srilanka
westindies

More Telugu News