Raghu Rama Krishna Raju: ఏపీ కేబినెట్ లో నిజాయతీగా మాట్లాడే కొద్ది మందిలో గౌతమ్‌రెడ్డి ఒక్కరు: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju pays condolences to Goutham Reddy
  • గౌతమ్ మరణ వార్తతో షాక్ కు గురయ్యాను
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
  • గౌతమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ఇరు తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయన మృతి పట్ల రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్ మృతి పట్ల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హార్ట్ అటాక్ తో గౌతమ్ చనిపోయారని తెలియగానే తాను షాక్ కు గురయ్యానని చెప్పారు.

ఆయన మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు. ఏపీ కేబినెట్ లో నిజాయతీగా మాట్లాడే అతి కొద్ది మంది మంత్రుల్లో గౌతమ్‌రెడ్డి ఒకరని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News