KTR: గౌతమ్‌రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు.. మిత్రుడి మరణ వార్తతో షాక్ కు గురయ్యాను: కేటీఆర్

KTR pays tributes to Mekapati Goutham Reddy
  • గౌతమ్ తో 12 ఏళ్లుగా పరిచయం ఉంది
  • ఇద్దరం ఎన్నోసార్లు కలుకున్నాం
  • ఇటీవలే 50వ పుట్టినరోజును జరుపుకున్నారు
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్... గౌతమ్ తండ్రిని ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గౌతమ్ తనకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా తమకు పరిచయం ఉందని... రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నోసార్లు కలుసుకున్నామని చెప్పారు.

ఉదయం గౌతమ్ మరణ వార్తను వినగానే షాక్ కు గురయ్యానని కేటీఆర్ తెలిపారు. ఇటీవలే 50వ పుట్టినరోజును జరుపుకున్న గౌతమ్ అకాల మరణం బాధాకరమని చెప్పారు. మిత్రుడి మరణంతో షాక్ కు గురయ్యానని అన్నారు. గౌతమ్ మరణంతో తనకే ఇలా ఉంటే... వారి కుటుంబసభ్యులకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో మాట్లాడానని... హైదరాబాదులో ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయనకు చెప్పానని తెలిపారు.
KTR
TRS
Mekapati Goutham Reddy
YSRCP

More Telugu News