Chandrababu: మంత్రి మేకపాటి నివాసానికి వెళ్లిన చంద్ర‌బాబు

chandrababu expresses condolences
  • జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌత‌మ్‌రెడ్డి పార్థివ దేహం
  • చంద్ర‌బాబు నాయుడు నివాళులు
  • గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి
గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయ‌న పార్థివ దేహాన్ని అభిమానులు, నేత‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచుతున్నారు.

ఆయ‌న నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు నివాళులు అర్పించారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి త‌న‌ను కలచి వేసింద‌ని, ఎంతో భవిష్యత్‌ ఉన్న మేకపాటి మృతి బాధాకరమని చెప్పారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Chandrababu
Telugudesam

More Telugu News