Nitin Gadkari: తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి విచ్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Union Minister Nitin Gadkari goes to CM Jagan residence
  • విజయవాడలో గడ్కరీ పర్యటన
  • బెంజి సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభం
  • గడ్కరీకి తన నివాసం వద్ద స్వాగతం పలికిన సీఎం జగన్
  • శాలువా కప్పి సత్కారం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యంగా, బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. పర్యటన అనంతరం నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి విచ్చేశారు. కేంద్రమంత్రికి సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News