Sathyavathi Rathod: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు పితృవియోగం

Telangana minister Sathyavathi Rathod father passed away
  • సత్యవతి తండ్రి లింగ్యానాయక్ కన్నుమూత
  • మేడారం జాతరను పర్యవేక్షిస్తున్న మంత్రి సత్యవతి
  • హుటాహుటీన పెద్ద తండాకు బయల్దేరిన మంత్రి
  • తండ్రి భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతం
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు పితృవియోగం కలిగింది. సత్యవతి రాథోడ్ తండ్రి గుగులోత్ లింగ్యానాయక్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ ఘటనతో సత్యవతి రాథోడ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

కాగా, మేడారం జాతర కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్... తండ్రి మరణవార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాకు బయల్దేరారు. అక్కడ తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్ ను సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించారు. లింగ్యానాయక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, లింగ్యానాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
Sathyavathi Rathod
Father
Lingya Naik
Demise
TRS
Telangana

More Telugu News