Tirumala: అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.. హనుమ జన్మస్థలంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy Says Hanuma Born In Tirumala
  • తిరుమలలోనే జన్మించాడన్నది నమ్మకమని కామెంట్
  • అందుకే ఆకాశగంగను సుందరీకరిస్తున్నామని వెల్లడి
  • శ్రీవాణి ట్రస్టు ద్వారా అభివృద్ధి పనులు

హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరోసారి స్పందించారు. ఆంజనేయుడి జన్మస్థలంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, హనుమ తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోందని తేల్చి చెప్పారు. అంజనాద్రిలో ఆలయ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు. ఆకాశగంగలో ఉన్న ప్రస్తుత ఆలయం అలాగే ఉంటుందని చెప్పారు.

హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడన్న నమ్మకంతోనే ఆకాశగంగ ఆలయాన్ని సుందరీకరిస్తున్నామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పనిసరిగా ఆకాశంగ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలను అందుకోసం వాడుతామన్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. రూ.35 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News