High Court: వైఎస్ వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్ల కొట్టివేత

Highcourt Quashes Petitions Filed By Erra Gangi Reddy and Uma Shankar Reddy
  • డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు
  • విచారించిన హైకోర్టు ధర్మాసనం
  • రెండు రోజులుగా మళ్లీ సాగుతున్న సీబీఐ విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. అప్రూవర్ గా మారుతున్నట్టు వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వాళ్లిద్దరూ వేసిన పిటిషన్ ను ఇవాళ కోర్టు విచారించి, కొట్టేసింది. కాగా, ఈ హత్య కేసులో సీబీఐ విచారణ రెండు రోజుల క్రితం మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. సోమవారం పులివెందులలో ముగ్గురు అనుమానితులను విచారించారు.
High Court
AP High Court
YS Vivekananda Reddy

More Telugu News