హిజాబ్ లేకుండా రావాలన్న ప్రిన్సిపాల్.. గేటు బయట విద్యార్థినుల నిరసన.. భారీగా పోలీసుల మోహరింపు
- విజయపుర గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత
- న్యాయం చేయాలంటూ విద్యార్థినుల నినాదాలు
- హైకోర్టు ఉత్తర్వులనే అనుసరిస్తున్నామన్న ప్రిన్సిపాల్
విద్యార్థులు బుర్ఖాలు, హిజాబ్ లతో కాలేజీలోకి ప్రవేశించడంతో టీచర్లు, ప్రిన్సిపాల్ వాళ్లను ఆపేశారు. హిజాబ్ లు లేకుండా క్లాసు రూంలోకి వెళ్లాలని వారికి సూచించారు. హిజాబ్ లు, బుర్ఖాలు వదిలి వచ్చేందుకు ప్రత్యేక గదిని కూడా కేటాయించారు. అయితే, వారి మాటలను విద్యార్థినులు వినలేదు. ఈ నేపథ్యంలోనే కాలేజీ గేటు బయట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాగా, కాలేజీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కొందరు మహిళా పోలీసులనూ అక్కడ భద్రతగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.