ఐపీఎల్ లో వీళ్లు ఒకప్పుడు స్టార్లు... ఈసారి ఒక్కరూ అమ్ముడుపోలేదు!

IPL franchises has no intention to buy old stars
  • ముగిసిన ఐపీఎల్ వేలం
  • పలువురు సీనియర్లకు మొండిచేయి
  • ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
క్రికెట్ ప్రపంచంలో అత్యంత సంపన్న లీగ్ గా పేరుగాంచిన ఐపీఎల్ లో ఈసారి చాలామంది సీనియర్ ఆటగాళ్లకు మొండిచేయి ఎదురైంది. ఒకప్పుడు లీగ్ లో స్టార్లుగా వెలుగొందిన స్టీవ్ స్మిత్, మార్టిన్ గప్టిల్, ఇయాన్ మోర్గాన్ వంటి విదేశీ ఆటగాళ్లను ఒక్కరు కూడా కొనుగోలు చేయలేదు.

అంతేకాదు, ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన పవన్ నేగి ఈసారి అనామకుడిగా మిగిలిపోయాడు. టీమిండియా తరఫున అనేక మ్యాచ్ లు ఆడిన లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాదీ అదే పరిస్థితి! అంతేకాదు, చెన్నై సూపర్ కింగ్స్ కు గతంలో అనేక విజయాలు అందించిన సురేశ్ రైనా సైతం కొనుగోలుకు నోచుకోలేదు.

ఎవరూ కొనుగోలు చేయని ప్రముఖ ఆటగాళ్ల జాబితా...

  • స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • సురేశ్ రైనా (కనీస ధర రూ.2 కోట్లు)
  • షకీబ్ అల్ హసన్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • అదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • ఇమ్రాన్ తాహిర్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • ఆడమ్ జంపా (కనీస ధర రూ.2 కోట్లు)
  • అమిత్ మిశ్రా (కనీస ధర రూ.1.5 కోట్లు)
  • ఇయాన్ మోర్గాన్ (కనీస ధర రూ.1.5 కోట్లు)
  • ఆరోన్ ఫించ్ (కనీస ధర రూ.1.5 కోట్లు)
  • డేవిడ్ మలాన్ (కనీస ధర రూ.1.5 కోట్లు)
  • ఇషాంత్ శర్మ (కనీస ధర రూ.1.5 కోట్లు)
  • కొలిన్ మున్రో (కనీస ధర రూ.1.5 కోట్లు)
  • పియూష్ చావ్లా (కనీస ధర రూ.1 కోటి)
  • మోజెస్ హెన్రిక్స్ (కనీస ధర రూ.1 కోటి)
  • మార్నస్ లబుషేన్ (కనీస ధర రూ.1 కోటి)
  • ఆండ్రూ టై (కనీస ధర రూ.1 కోటి)
  • తబ్రైజ్ షంసీ (కనీస ధర రూ.1 కోటి)
  • మార్టిన్ గప్టిల్ (కనీస ధర రూ.75 లక్షలు)
  • షెల్డన్ కాట్రెల్ (కనీస ధర రూ.75 లక్షలు)
  • ధవళ్ కులకర్ణి (కనీస ధర రూ.75 లక్షలు)
  • చటేశ్వర్ పుజారా (కనీస ధర రూ.50 లక్షలు)
  • ఇష్ సోధి (కనీస ధర రూ.50 లక్షలు)
  • పవన్ నేగి (కనీస ధర రూ.5
Go Back to Shorts
IPL
Star Cricketers
Auction
Franchises

More Telugu News