కాంగ్రెస్ ప్రచార పోస్టర్లోని మూడో అమ్మాయి కూడా బీజేపీలోకే!
- పార్టీ తీర్థం పుచ్చుకున్న పల్లవి సింగ్
- ముఖ్య నేతల సమక్షంలో చేరిక
- ‘లడ్ కీ హూ.. లఢ్ సక్తీ హూ’ ప్రచారంలో కీలకంగా పల్లవి
కాగా, బీజేపీలో చేరే సమయంలో కాంగ్రెస్ పై వందనా సింగ్ విమర్శలు గుప్పించారు. అనవసర విషయాల్లోనూ పార్టీ హై కమాండ్ జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. ఎప్పట్నుంచో ఉంటున్న తమను కాదని, కొత్తగా వస్తున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లు పార్టీలో పనిచేశానని, కాంగ్రెస్ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశానని తెలిపారు. అయినాగానీ ప్రియాంకాగాంధీతో మాట్లాడే అవకాశమే రాలేదని, తమ కోసం తామే గొంతెత్తలేని పరిస్థితి ఉందని ఆమె కాంగ్రెస్ ను వీడుతూ ఆరోపణలు చేశారు.