సత్తా చాటిన అయ్యర్... టీమిండియా 265 ఆలౌట్
- అహ్మదాబాద్ లో మూడో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- అయ్యర్, పంత్ అర్ధసెంచరీలు
- రాణించిన సుందర్, చహర్
ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేయగా, ఓపెనర్ ధావన్ 10 పరుగులు చేసి నిరాశపరిచాడు. మాజీ కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4 వికెట్లు తీయగా, అల్జారీ జోసెఫ్ 2, హేడెన్ వాల్ష్ 2 వికెట్లు పడగొట్టారు. ఓడియన్ స్మిత్, ఫాబియెన్ అలెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.