Team India: చివరి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా... కోహ్లీ డకౌట్

Team India won the toss and elected batting in third ODI
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డే నేడు అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ విజృంభించడంతో భారత్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లీ (0)లను అల్జారీ జోసెఫ్ ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో భారత్ కష్టాల్లో పడింది. కోహ్లీ రెండు బంతులాడి డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 6 ఓవర్లలో 2 వికెట్లకు 19 పరుగులు కాగా... ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.

కాగా, వన్డే సిరీస్ ను భారత జట్టు ఇప్పటికే 2-0తో చేజిక్కించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి వన్డేకు ఏమంత ప్రాధాన్యత లేకుండా పోయింది. వెస్టిండీస్ కనీసం దీంట్లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా, టీమిండియా క్లీన్ స్వీప్ పై కన్నేసింది.
Go Back to Shorts
Team India
Toss
West Indies
3rd ODI
Ahmedabad

More Telugu News