Sun Risers Hyderabad: ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్ హెచ్ కొత్త జెర్సీ అదుర్స్.. చూశారా!

Orange Army SRH Releases New Jersey
  • నిన్న సాయంత్రం విడుదల చేసిన జట్టు
  • ఈసారి ట్రాక్ ప్యాంట్ కూడా ఆరెంజే
  • పలు మార్పులతో కొత్త జెర్సీ
గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో అట్టడుగున నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఈసారైనా ట్రోఫీ నెగ్గాలన్న దృఢమైన పట్టుదలతో ఉంది. ఆ క్రమంలోనే డేవిడ్ వార్నర్ ను వేలానికి రిలీజ్ చేసిన టీమ్ మేనేజ్ మెంట్.. న్యూజిలాండ్ కూల్ కేన్ విలియమ్సన్ ను కెప్టెన్ గా చేసింది.


అంతేకాదు.. జట్టు జెర్సీనీ మార్చేసింది. నిన్న సాయంత్రం కొత్త జెర్సీని విడుదల చేసింది. ‘పైకి ఎదగడానికి సిద్ధం’ అంటూ నలుపు, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో జెర్సీని రూపొందించింది. జెర్సీ ముందుభాగాన్నంతా ప్లెయిన్ గా పెట్టేసింది. సన్ రైజర్స్ అని కనిపించేలా పెద్ద అక్షరాలతో ముందు భాగంలో ముద్రించారు.

ఇంతకుముందు జెర్సీతో పోలిస్తే కొన్ని మార్పులను చేసింది. ఇంతకుముందు భుజాలపై ఆరెంజ్ కలరే ఉంటుండగా.. ఇప్పుడు పూర్తి నలుపునకు మార్చింది. ఇక ఇంతకుముందు జెర్సీ ముందుభాగంలో షేడ్స్ తో కూడిన ఆరెంజ్ కలర్ ఉండగా.. ఇప్పుడు పూర్తి కాషాయ రంగులో తీర్చిదిద్దారు.

ఇక గత జెర్సీలో ప్యాంట్ రంగు నలుపు కాగా.. ఇప్పుడు ఆరెంజ్ కు మార్చారు. మొత్తంగా ఆరెంజ్ ఆర్మీ పూర్తిగా ఆరెంజ్ లోనే కనిపించనుందన్నమాట. మరి, మారిన కెప్టెన్.. మారిన జెర్సీతోనైనా ఆరెంజ్ ఆర్మీ రాత మారుతుందా? అన్నది వేచి చూడాలి. వేలంలో తీసుకునే ఆటగాళ్లపైనే జట్టు పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. ఎల్లుండే ఆటగాళ్ల వేలం జరగనుంది.
Sun Risers Hyderabad
SRH
IPL
New Jersey
Orange Army
Cricket

More Telugu News