మొదలైన టీ20 ప్రపంచకప్ టికెట్ల విక్రయం.. హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు

India pakistan t20 world cup match tickets sold in one hour
  • ఈ ఏడాది అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టోర్నీ
  • అక్టోబరు 23న భారత్-పాక్ ఢీ
  • గంటలోనే అమ్ముడుపోయిన టికెట్లు
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అది ఎక్కడ జరిగినా, ఏ స్థాయిలో జరిగినా ఆ మజానే వేరు. దీనిని ఆస్వాదించేందుకు ప్రపంచం నలుమూలల ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్సాహం చూపుతుంటారు. తాజాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మరోమారు తలపడనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్ల విక్రయం నిన్న ప్రారంభం కాగా, దాయాదుల మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంటలోపే టికెట్లు అన్నీ ఖాళీ కావడం గమనార్హం.

ఈ ఏడాది అక్టోబరు 16 నుంచి నవంబరు 13 మధ్య ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అక్టోబరు 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఫైనల్‌తో మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను కూడా విక్రయానికి ఉంచారు. పిల్లలకు 5 డాలర్లు (రూ. 373), పెద్దలకు 20 డాలర్లు (1,493) నిర్ణయించారు. అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హాబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలలో మ్యాచ్‌లు జరుగుతాయి.
Go Back to Shorts
India
Pakistan
T20 World Cup
Australia
Tickets

More Telugu News