Narendra Modi: ఎన్నిసార్లు ఓడించినా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంతే!: లోక్ సభలో ప్రధాని మోదీ

PM Modi fires on Congress Party in Lok Sabha
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం
  • చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని
  • అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ ను తిప్పికొట్టాయన్న మోదీ 
  • ఇంకా అహంకారం తగ్గలేదని వ్యాఖ్యలు
లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, విపక్ష కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. అనేక రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. ఎన్నిసార్లు ఎన్నికల్లో ఓడించినా కాంగ్రెస్ నైజంలో ఏ మార్పు లేదని, ఇగో ఏమాత్రం తగ్గలేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా సరే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని ఎత్తిపొడిచారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ ఈమేరకు విరుచుకుపడ్డారు. అనేక సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్, త్రిపుర, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీని ఆయా రాష్ట్రాల వారు ఇప్పటికీ ఆమోదించే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గనుక అధికారంలో ఉండుంటే అంతా కొవిడ్ పై నెట్టేసి తాను తప్పించుకునేదని ఆరోపించారు.
Narendra Modi
Congress
Lok Sabha
BJP
India

More Telugu News