తెలంగాణలో గత 24 గంటల్లో 1,380 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 350 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 24,000 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,78,910 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,50,809 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,000 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,101కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం మరణాల రేటు 0.53 శాతానికి పడిపోగా, రికవరీ రేటు 96.39 శాతంగా ఉంది.
