Roja: తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

YCP MLA Roja met Tamilnadu CM MK Stalin in Chennai
  • చెన్నై వెళ్లిన రోజా
  • స్టాలిన్ తో సమావేశం
  • ప్రత్యేకంగా రూపొందించిన శాలువాల బహూకరణ
  • ఏపీలో నివసిస్తున్న తమిళుల అంశం ప్రస్తావన
వైసీపీ మహిళా శాసనసభ్యురాలు రోజా నేడు చెన్నై వెళ్లి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. తన భర్త ఆర్కే సెల్వమణితో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లిన రోజా... స్టాలిన్ కు కొన్ని ప్రత్యేకమైన శాలువాలను బహూకరించారు. ఆ శాలువాలపై స్టాలిన్ బొమ్మ ముద్రించి ఉండడం విశేషం.

ఇక, స్టాలిన్ తో భేటీ సందర్భంగా ఏపీలో నివసిస్తున్న తమిళుల సమస్యలను ఆయనకు వివరించారు. దీనికి సంబంధించి వినతిపత్రం కూడా అందించారు. రోజా విజ్ఞప్తి పట్ల స్టాలిన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
Roja
MK Stalin
RK Selvamani
Chennai
Tamilnadu
YSRCP
Andhra Pradesh

More Telugu News