Gorantla Butchaiah Chowdary: ఛలో విజయవాడ విజ‌య‌వంతం కావ‌డంతో జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారు.. అందుకే ఇలా చేస్తున్నారు: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

gorantla fires on jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోలీసులు నిర్బంధాలను ఛేదించి ఛలో విజయవాడ కార్యక్ర‌మాన్ని విజయవంతం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల నిర‌స‌న విజ‌య‌వంతం కావడంతో జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నార‌ని, అందుకే ఏపీ అంతటా విద్యుత్ కోత‌లు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.

పోలీసుల‌పై కూడా జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం దుర్మార్గ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఉద్యోగుల‌ను అదుపు చేయ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యారంటూ పోలీసుల‌పై మండిప‌డ్డార‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాల‌రాస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
Go Back to Shorts
Gorantla Butchaiah Chowdary
YSRCP
Andhra Pradesh

More Telugu News