అమెరికాలో మళ్లీ హెచ్1బీ వీసా జారీ ప్రక్రియ
- మార్చి 1 నుంచి దరఖాస్తులు
- మార్చి 18తో ముగియనున్న గడువు
- లాటరీ పద్ధతిలో వీసాలకు ఎంపిక
- ఏటా 65 వేల హెచ్1బీ వీసాల జారీ
కాగా, రిజిస్ట్రేషన్ దరఖాస్తు సమయంలో 10 డాలర్ల రుసుం చెల్లించాలి. రిజిస్ట్రేషన్లకు మార్చి 18 ఆఖరు తేదీ. గడువులోపల దరఖాస్తు చేసుకున్నవారికి ర్యాండమ్ పద్ధతిలో హెచ్1బీ వీసాలు కేటాయిస్తారు. ఒకవిధంగా ఇది లాటరీ పద్ధతే. ఈ విడతలో వీసాలు పొందేవారు అక్టోబరు నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరే వెసులుబాటు ఉంటుంది.
హెచ్1బీ వీసా తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చే వీసా. ఈ వీసాలతో అమెరికాలో అడుగుపెట్టేవారిలో అత్యధికులు భారతీయులే ఉంటారు.