Rashmi Gautam: ‘బ్యాన్ జూ’ అంటూ ఢిల్లీ జూ సిబ్బందిపై యాంకర్ రష్మీ ఫైర్

Why Rashmi Wanted To Ban Delhi Zoo
షార్ట్స్‌లో చూడండి
మూగజీవాలపై యాంకర్, నటి రష్మీ ఎంతో ప్రేమ చూపిస్తుంటుంది. అందుకే, ఇటీవల ఢిల్లీ జూలో భారీ నీటి ఏనుగుపై జూ సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ రోజు జూలో కేజ్ నుంచి అది తల బయటపెట్టి చూస్తున్నప్పుడు అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాని తలపై కొట్టాడు.

దానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయడంతో.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. జూ సిబ్బంది తీరు బాధాకరమని మండిపడింది.

‘‘లాక్ డౌన్ లో మూడు నెలలు ఇంట్లో బంధిస్తేనే మనం ఎంతగా అల్లాడిపోయాం. అలాంటిది జీవితాంతం బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఆలోచించండి’’ అంటూ పోస్ట్ పెట్టారు. బ్యాన్ జూ అంటూ ట్యాగ్ చేశారు.
Go Back to Shorts
Rashmi Gautam
New Delhi
Zoo

More Telugu News