వెస్టిండీస్ తో వన్డేలు, టీ20లకు వేదికలు మార్చిన బీసీసీఐ
- భారత్ లో కరోనా వ్యాప్తి
- ఫిబ్రవరిలో టీమిండియా-వెస్టిండీస్ మధ్య వన్డేలు, టీ20లు
- వన్డే మ్యాచ్ లన్నీ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహణ
- టీ20 సిరీస్ కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం
మూడు వన్డేలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయని, మూడు టీ20 మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతాయని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.