తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- డిజిటల్ సభ్యత్వ నమోదుపై సమీక్ష
- హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- టీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు
- కాంగ్రెస్ వల్లే దేశాభివృద్ధి అని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశం అభివృద్ధి పథంలోకి వచ్చిందని ఉత్తమ్ స్పష్టం చేశారు. బీజేపీ తరహాలో విభజించి పాలించడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. సూర్యాపేట అసెంబ్లీ స్థానం డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.