AP Cabinet: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... ఆమోదం తెలిపిన నిర్ణయాలు ఇవిగో!

AP Cabinet approves key decisions
షార్ట్స్‌లో చూడండి
సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు క్యాబినెట్ సమ్మతించింది. ప్రభుత్వ ఉద్యోగులకు హౌసింగ్ పై ఆమోద ముద్ర వేసింది. అటు, కరోనా కట్టడిపైనా సీఎం జగన్ మంత్రివర్గం చర్చించింది.

ఆమోదం తెలిపిన నిర్ణయాలు...

  • ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు  
  • ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం  
  • జగనన్న టౌన్ షిప్పులలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ఇవ్వాలని నిర్ణయం  
  • ఉద్యోగులతో చర్చలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు  
  • ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద మహిళలకు రూ.45 వేల ఆర్థికసాయం  
  • ఈబీసీ నిధులు రూ.580 కోట్లకు క్యాబినెట్ ఆమోదం
  • 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున సాయం  
  • 3.92 లక్షల మందికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లు సాయం
  • బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదు ఎకరాల భూమి కేటాయింపు  
  • విశాఖలో అదాని డేటా సెంటర్ కు భూమి కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం  
  • వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజ్ ప్రతిపాదనకు ఆమోదం 
  • కడప, కర్నూలు విమానాశ్రయాల్లో రాకపోకలకు ఇండిగోతో ఒప్పందం
  • కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను 25 ఏళ్లు బిడ్ ద్వారా అప్పగించాలని నిర్ణయం
  • టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా చట్ట సవరణకు ఆమోదం
  • ఐసీడీఎస్ లో బాలామృతం, పాల సరఫరాను అమూల్ కు అప్పగిస్తూ నిర్ణయం

Go Back to Shorts
AP Cabinet
CM Jagan
PRC
Employees
YSRCP
Andhra Pradesh

More Telugu News