'బంగార్రాజు' నుంచి సాంగ్ టీజర్!

20-01-2022 Thu 17:19
  • 'బంగార్రాజు'గా నాగార్జున
  • ఆయన భార్య పాత్రలో రమ్యకృష్ణ
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
  • ఈ నెల 14న థియేటర్లకు వచ్చిన సినిమా
Bangarraju song released
నాగార్జున కథనాయకుడిగా ఆయన నిర్మాణంలోనే 'బంగార్రాజు' సినిమా రూపొందింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రీసెంట్ గా 'బ్లాక్ బస్టర్ మీట్'ను కూడా జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ టీజర్ ను వదిలారు.

'నువ్వు సిగ్గుపడితే బాగుంటావే ఓ సత్యభామ .. సిగ్గులో సింగారముంటాదే, వద్దన్నా కొద్దీ ముద్దొస్తావే నా ఎన్నెలమ్మా .. గారంగా చూస్తూనే గారం చేస్తావే' అంటూ ఈ పాట సాగుతోంది. నాగార్జున - రమ్యకృష్ణలపై చిత్రీకరించిన ఈ పాట బ్యూటిఫుల్ గా ఉంది. కొరియోగ్రఫీ కూడా బాగుంది.

అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకుంటోంది. చాలా కాలం తరువాత నాగార్జున - రమ్యకృష్ణ కలిసి తెరపై సందడి చేసిన పాట ఇది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాలో, నాగచైతన్య బుల్లి బంగార్రాజుగా కనిపించగా ఆయన జోడీగా కృతి శెట్టి అలరిస్తోంది.