దక్షిణాఫ్రికా జూలో మూడు సింహాలకు కరోనా.. మనుషుల నుంచే సోకిన వైరస్
- 15 రోజులపాటు దగ్గు, ఆయాసం, ముక్కు కారడం వంటి లక్షణాలు
- ఊపిరి అందక ఇబ్బందిపడిన మృగరాజులు
- 25 రోజుల్లో వైరస్‌ను జయించిన సింహాలు
గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఇది జరిగింది. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాలు ‘వైరసెస్’ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. సింహాలు కరోనా బారిన పడిన ఏడు వారాల తర్వాత నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులోనూ పాజిటివ్‌గానే నిర్ధారణ అయింది. ఇవి ఐదు నుంచి 15 రోజుల పాటు పొడిదగ్గుతో బాధపడగా, రెండు సింహాలు మాత్రం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాయి. మొత్తంగా 25 రోజుల్లో సింహాలన్నీ కొవిడ్‌ను జయించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.