పేద పిల్లలకు ఆ అవకాశాన్ని ఇవ్వొద్దని ఏడుస్తున్న బాబు గ్యాంగ్ ఎలా స్పందిస్తుందో?: తెలంగాణాలో ఇంగ్లిష్ మీడియంపై విజయసాయిరెడ్డి

18-01-2022 Tue 11:54
  • ఏపీలో ఇంగ్లిష్ మీడియంపై ప్రతిపక్షాల విమర్శలు
  • తెలంగాణాలో పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం  
  • తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేద పిల్లలకు వద్దంటున్నారంటూ విమర్శ   
Vijaya Sai Reddy Satires On Chandrababu Over Telangana Decision On English Medium
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియాన్ని అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వివరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

ఇంగ్లిష్ మీడియం అమలు విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించిందని, తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేద పిల్లలకు ఆ అవకాశాన్ని ఇవ్వొద్దని ఏడుస్తున్న బాబు గ్యాంగ్ ఎలా స్పందిస్తుందోనంటూ వ్యాఖ్యానించారు. కాగా, గత ఏడాది ఏపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకోగా, టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.