హిమాలయాల్లో కరోనాకు అడ్డుకట్ట వేసే మొక్క: గుర్తించిన శాస్త్రవేత్తలు
- రోడోడెండ్రాన్ అర్బోరియం అనే మొక్క గుర్తింపు
- ఈ మొక్క పువ్వుల్లో ఫైటోకెమికల్స్
- కొవిడ్ చికిత్సలో ఫైటోకెమికల్స్‌ది కీలక పాత్ర
స్థానికంగా ఈ మొక్కను ‘బురాన్ష్’ అని పిలుస్తారు. ఇందులోని ఫైటోకెమికల్స్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు ‘బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. తాము గుర్తించిన బుర్షాన్ మొక్క పూరేకులను స్థానికులు రకరకాల చికిత్సలో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారని ఐఐటీ మండీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి తెలిపారు.