Dhanush: 18 ఏళ్ల బంధానికి తెర.. విడిపోతున్నట్టు ప్రకటించిన నటుడు ధనుష్- ఐశ్వర్య

Dhanush and Wife Aishwaryaa Separate After 18 Years Of  Bond
  • నవంబరు 2004లో వివాహం
  • విడిపోతున్నట్టు ఇద్దరూ వేర్వేరుగా ప్రకటన
  • తమ నిర్ణయాన్ని గౌరవించాలన్న ధనుష్
  • అర్థం చేసుకోవాలన్న ఐశ్వర్య
చిత్ర పరిశ్రమకు చెందిన మరో స్టార్ జంట విడిపోతోంది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ తామిద్దరం విడిపోతున్నట్టు కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్-సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరూ విడివిడిగా సోషల్ మీడియాలో లేఖలు పోస్టు చేశారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితంలో స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయాణించామని, ఇప్పుడిక వేర్వేరు దారుల్లో నడవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని ధనుష్ తన అభిమానులను కోరారు.

నిర్మాత, నేపథ్య గాయని అయిన ఐశ్వర్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇలానే స్పందించారు. ఈ లేఖకు ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని, ఈ పరిస్థితిని అర్థంచేసుకోవడం, ప్రేమ మాత్రమే కావాలని పేర్కొన్నారు. కాగా, ధనుష్, ఐశ్వర్య 18 నవంబరు 2004లో వివాహం చేసుకున్నారు.

Dhanush
Aishwaryaa
Kollywood
Rajinikanth
Marriage

More Telugu News