Secunderabad Club: సికింద్రాబాద్‌ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 20 కోట్ల ఆస్తి నష్టం!

Fire accident in Secunderabad Club
  • తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం
  • క్షణాల్లోనే క్లబ్ మొత్తం చెలరేగిన అగ్ని కీలలు
  • ప్రమాద కారణాలపై పోలీసుల ఆరా
సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తి కాలిబూడిదైంది. ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్‌‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లోనే క్లబ్ మొత్తం పాకి బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 20 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Secunderabad Club
Fire Accident
Hyderabad

More Telugu News