Talasani: నెక్లెస్ రోడ్ లో పతంగులు ఎగరేసిన మంత్రి తలసాని

Talasani attends Kite Festival in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
సంక్రాంతి పండుగ అంటే చిన్నా పెద్దా అందరూ పతంగులు ఎగరేస్తూ ఎంతో ఉల్లాసంగా గడుపుతారు. తాజాగా, హైదరాబాద్ లోని పీవీ మార్గ్ లో నెక్లెస్ రోడ్ వద్ద కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగరేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకుంటారని వెల్లడించారు. విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల ప్రజలు మన సంప్రదాయాలు మర్చిపోతున్నారని, మన ఆచారాలు, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పండుగల విశిష్టతను పిల్లలకు తల్లిదండ్రులే విడమర్చి చెప్పాలని అన్నారు.
Go Back to Shorts
Talasani
Kite Festival
Hyderabad
Sankranti

More Telugu News