పశ్చిమ బెంగాల్లో పట్టాలు తప్పిన రైలు... ముగ్గురి మృతి

Train derailed in West Bengal
  • జల్పాయ్ గురి జిల్లాలో ఘటన
  • ప్రమాదానికి గురైన గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్
  • బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు
  • ముమ్మరంగా సహాయక చర్యలు
పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలు న్యూ దామోహని వద్ద పట్టాలు తప్పింది. ఆరు బోగీలు పక్కకి పడిపోయాయి. మరో ఆరు బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్టు నిర్ధారించారు. పడిపోయిన బోగీల్లో ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు.

పట్టాలపై పగుళ్లు ఉన్నందునే రైలు ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుండడంతో ప్రమాద తీవ్రత సాధారణ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఘటన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
Go Back to Shorts
Train Accident
West Bengal
Gouhati-Bikaneer Express
Derail

More Telugu News