తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరా నిలిపివేస్తారా?: వైసీపీ నేతలపై జీవీఎల్ ఆగ్రహం
- రేణిగుంట ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేత అంటూ కథనం
- పత్రికా కథనం నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ స్పందన
- దిగ్భ్రాంతి కలిగిస్తోందంటూ వ్యాఖ్యలు
- ఉన్నతస్థాయి విచారణ కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడి
"తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిబ్బంది క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రోడ్లు తవ్వేయడం దారుణం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశాను. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరాను" అంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ట్వీట్ తో పాటు సదరు పత్రికా కథనాన్ని కూడా ఆయన పంచుకున్నారు.