కాగజ్‌నగర్ అడవుల్లో 'మొరిగే జింక'.. కెమెరా కంటికి చిక్కిన అరుదైన వన్యప్రాణి!
- 15 ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ కనిపించిన బార్కింగ్ డీర్
- తోటి జంతువులు ప్రమాదంలో పడినప్పుడు కుక్కలా మొరిగి హెచ్చరికలు
- దట్టమైన అటవీ ప్రాంతంలో ఆవాసం
ఇవి జనావాసాలకు చాలా దూరంగా, దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే నివసిస్తుంటాయి. ముఖ్యంగా దేశంలోని పశ్చిమ కనుమల్లో, హిమాలయాల సమీపంలో ఇవి కనిపిస్తుంటాయి. కాగా, 15 ఏళ్ల క్రితం నల్లమల అడవుల్లో బార్కింగ్ డీర్ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ దీని జాడ లేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇది కనిపించడంతో అటవీ అధికారులతోపాటు వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.