సమంత బాగుంది.. నేను బాగున్నా: నాగచైతన్య

12-01-2022 Wed 21:54
  • ఇటీవలే వైవాహిక బంధానికి ముగింపు పలికిన నాగచైతన్య, సమంత
  • ఇద్దరం సంతోషంగా ఉన్నామన్న నాగచైతన్య
  • బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న సమంత
me and samantha are fine says naga chaitanya
ఇటీవలే నాగ చైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోవడంపై సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై నాగచైతన్య ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ప్రస్తుతం సమంత సంతోషంగా ఉందని.. తాను కూడా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. తమ నిర్ణయం ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ అని చెప్పాడు.

ఇక వీరి కెరీర్ విషయాల్లోకి వెళ్తే... సామ్ బాలీవుడ్ పై పూర్తిగా దృష్టిని సారించింది. ముంబైలో సెటిల్ అవ్వాలని ఆమె ప్రయత్నిస్తోంది. నాగచైతన్య విషయానికి వస్తే... తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సంక్రాంతి సీజన్ లో భారీ బడ్జెట్ సినిమాల విడుదల వాయిదా పడ్డాయి. ఈ సీజన్ లో విడుదల అవుతున్న పెద్ద సినిమా 'బంగార్రాజు' మాత్రమే. ఈ సినిమా ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.