లవ్ లో పడ్డ హీరోయిన్ నిధి అగర్వాల్.. హీరో ఇంట్లోనే మకాం?

08-01-2022 Sat 17:36
  • శింబు ప్రేమలో నిధి ఉందంటూ ప్రచారం
  • పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ వార్తలు
  • 'ఈశ్వరన్' షూటింగ్ సమయంలో ప్రేమ మొలకెత్తిందట
Nidhi aggarwal in love with Simbu
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రేమలో మునిగితేలుతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తమిళ హీరో శింబు ప్రేమలో ఆమె ఉందని అంటున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెపుతున్నారు. 'ఈశ్వరన్' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. గత ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు కొంత కాలంగా శింబు ఇంట్లోనే నిధి ఉంటోందనే ప్రచారం కూడా జరుగుతోంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు వీరు రెడీ అవుతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తేలాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రేమాయణాలు శింబుకు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ఆయన ప్రేమాయణాలు సాగించారు.