Vanama Raghavendra: వెలుగులోకి రామకృష్ణ మరో వీడియో.. ఈసారి మరిన్ని సంచలన విషయాలు!

Naga Ramakrishna another selfie video viral on social media
  • మా సోదరితో రాఘవకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం
  • రాఘవ, నా తల్లి, సోదరి కారణంగా మానసిక క్షోభ అనుభవించాను
  • అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దు
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర వేధింపులు తాళలేక భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణకు సంబంధించి మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు  తీసుకున్న సెల్ఫీ వీడియోల్లో రోజుకొకటి వెలుగులోకి వస్తుండగా, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వనమా రాఘవపై రామకృష్ణ ఈసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రాఘవతోపాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని తెలిపారు.

తన ఆత్మహత్యకు ఆయనే కారణమని ఆరోపించిన రామకృష్ణ.. తన సోదరితో రాఘవకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందన్నారు. వాటాలు పంచకుండా చివరికి చావు వరకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ద్వారా తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుకున్నారని వాపోయారు.

ఇక తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దని రామకృష్ణ ఆ వీడియోలో వేడుకున్నారు. కాగా, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న రాఘవ ఓ వాహనంలో ఏపీవైపు పారిపోతుండగా గత రాత్రి పదిన్నర గంటల సమయంలో చింతలపూడి వద్ద అరెస్ట్ చేశారు.
Vanama Raghavendra
Palvancha
Bhadradri Kothagudem District
Naga Ramakrishna

More Telugu News