Ashok Galla: 'హీరో' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి డేట్ ఖరారు!

Hero Trailer Launch Event on Jan 9th
షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. కృష్ణ పెద్ద కూతురు గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఈ నెల 9వ తేదీన తిరుపతిలోని 'నెహ్రూ మున్సిపల్ హై స్కూల్' గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. అందుకు సంబందించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.

అశోక్ జోడీగా నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నరేశ్ .. వెన్నెల కిశోర్ .. సత్య .. బ్రహ్మాజీ కనిపించనున్నారు. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
Go Back to Shorts
Ashok Galla
Nidhi Agarwal
Hero Movie

More Telugu News