ఇదిగో డ్రామా మొదలైంది:రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
- తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ
- జేపీ నడ్డా ఆధ్వర్యంలో నేడు కొవ్వొత్తుల ర్యాలీ
- అనుమతి లేదంటున్న పోలీసులు
- వ్యంగ్యంగా స్పందించిన రేవంత్
బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారని వెల్లడించారు. ఇదంతా కూడా బీజేపీనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమని చూపించడం కోసమేనా? అని రేవంత్ ప్రశ్నించారు.
"సరే, ఈ విషయం నేను బహిర్గతం చేశాను కాబట్టి, డ్రామా ఎలా సాగుతుందో చూద్దాం" అంటూ ట్వీట్ చేశారు. అటు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ పట్టుదలగా ఉండగా, ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు చెబుతుండడం తెలిసిందే.