ఢిల్లీలో నితిన్ గడ్కరీతో జగన్ భేటీ
- ఏపీలో రహదారుల నిర్మాణంపై చర్చ
- తీర ప్రాంతం వెంబడి రహదారుల నిర్మాణం చేపట్టాలని వినతి
- విశాఖ-భోగాపురం జాతీయ రహదారి నిర్మాణంపై చర్చ
విజయవాడ తూర్పు హైవే ఏర్పాటుపై కూడా జగన్ చర్చలు జరుపుతున్నారు. అలాగే, ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరుతున్నారు. కాగా, కాసేపట్లో జగన్ మరికొంత మంది కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశమై ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరపనున్నారు.