Tollywood Producer: ఏపీ మంత్రుల వ్యాఖ్యలు సినీ పరిశ్రమను బాధించేలా ఉన్నాయి: నిర్మాత ఎన్వీ ప్రసాద్

AP ministers comments are painful to Tollywood says Producer NV Ramana
  • ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది
  • హీరోల స్పందన వల్ల సమస్య వచ్చింది
  • నట్టి కుమార్ తెలంగాణలో ప్రత్యేక ఛాంబర్ పెట్టుకోవాలి
సినిమా టికెట్ల అంశం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య అగాధాన్ని సృష్టించింది. హీరోలు నాని, సిద్ధార్థ్ లు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత, ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల పలువురు ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను బాధిస్తున్నాయని అన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న కొన్ని సమస్యల పట్ల హీరోలు స్పందించడం వల్ల సమస్య వచ్చిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారయిందని విమర్శించారు.
 
జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఎంతో పని ఒత్తిడిలో ఉంటారని... థియేటర్ల సీజ్ అంశం గురించి వారిని కలవడం వల్ల ప్రయోజనం లేదని ఎన్వీ ప్రసాద్ అన్నారు. హీరో నాని ఏపీ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలన్న నిర్మాత నట్టి కుమార్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నట్టి కుమార్ కు కావాలనుకుంటే తెలంగాణలో ప్రత్యేక ఫిలిం ఛాంబర్ పెట్టుకోవాలని సూచించారు.
Tollywood Producer
NV Prasad
Tickets
Andhra Pradesh
Government
Natti Kumar

More Telugu News