Vundavalli Sridevi: అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులు ఏమీలేవు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

YSRCP MLA Undavalli Sridevi controversial comments on Ambedkar
  • ఓ ప్రైవేట్ కార్యక్రమంలో శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు హక్కులు వచ్చాయని వ్యాఖ్య
  • శ్రీదేవి వ్యాఖ్యలపై అభిమానుల ఆగ్రహం

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ వల్ల మనకు వచ్చిందేమీ లేదని అన్నారు. ఆయన వల్ల మనకు వచ్చిన హక్కులు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బాబూ జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు శ్రీదేవి వ్యాఖ్యలపై అంబేద్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News