Nora Fatehi: నేను అనుభవిస్తున్న బాధ ఎవరూ అనుభవించకూడదు: బాలీవుడ్ నటి నోరా ఫతేహి

Bollywood actress Nora Fatehi suffering from Corona
  • దురదృష్టవశాత్తు నేను కరోనా బారిన పడ్డాను
  • కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది
  • ప్రతి ఒక్కరికి మహమ్మారి సోకే అవకాశం ఉంది
బాలీవుడ్ లో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. ఇటీవలే నటీమణులు కరీనా కపూర్, అమృత అరోరాలతో పాటు బోనీ కపూర్ మొత్తం కుటుంబం కరోనా బారిన పడింది. తాజాగా మరో హీరోయిన్ కు కరోనా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని నోరా ఫతేహి ప్రకటించింది.

సోషల్ మీడియా ద్వారా నోరా స్పందిస్తూ... దురదృష్టవశాత్తు తాను కరోనా బారిన పడ్డానని తెలిపింది. కరోనాతో తాను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. గత కొన్ని రోజులుగా తాను బెడ్ కే పరిమితమయ్యానని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని కోరింది.

మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని... ప్రతి ఒక్కరిని తాకే అవకాశం ఉందని చెప్పింది. తాను అనుభవిస్తున్న బాధ ఎవరూ అనుభవించకూడదని తెలిపింది. ఆరోగ్యం కంటే మనకు ఏదీ ఎక్కువ కాదని చెప్పింది. మరోవైపు నోరా కరోనా బారిన పడిందనే వార్తలతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
Nora Fatehi
Bollywood
Corona Virus

More Telugu News