బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవు: షర్మిల
- సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన షర్మిల
- చార్జీలన్నీ పెంచేస్తున్నారంటూ విమర్శలు
- సామాన్యుడిపై కరెంట్ భారాన్ని మోపారని వెల్లడి
- వైఎస్సార్ హయాంలో చార్జీలు పెరగలేదన్న షర్మిల
50 యూనిట్ల లోపు వాడుకునే 40 లక్షల పేదలను కూడా వదలకుండా ముక్కు పిండి వసూలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఏడాదికి రూ.6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై విద్యుత్ భారాన్ని మోపాడని మండిపడ్డారు. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు తెచ్చిన అప్పుల మీద వడ్డీకి వడ్డీ ప్రజల నుంచే వసూలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనానికి కరెంటు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉండాలంటూ షర్మిల పిలుపునిచ్చారు.