అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు తెలుగు టీనేజర్ల మృతి
- అమెరికా తెలుగు సమాజంలో విషాదం
- గెట్ టుగెదర్ పార్టీకి హాజరైన తెలుగు కుటుంబం
- తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
భార్య రజిత, కుమార్తె అక్షరా రెడ్డి, కుమారుడు అర్జిత్ రెడ్డిలతో కలిసి ఈ నెల 18న తెలుగు కుటుంబాల సమ్మేళనంలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, అక్షరా రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. తండ్రి రామచంద్రారెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం విషమ పరిస్థితి నుంచి గట్టెక్కినట్టు తెలిసింది.