Andhra Pradesh: ఏపీలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్

AP records eighty two corona cases
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 25,086 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 82 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, కడప జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,492 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,836 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,166 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,490కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Today Cases
Daily Report

More Telugu News