పవన్ ఒప్పుకుంటే ఆయనతోనే 'శ్యామ్ సింగ రాయ్ 2'
- 'శ్యామ్ సింగ రాయ్'గా నాని
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన సినిమా
- మంచి రెస్పాన్స్ వస్తోందంటూ టీమ్ హ్యాపీ
- పవన్ తో చేయాలనుందన్న డైరెక్టర్
"పవన్ కల్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సహజంగానే ఆయనలో ఒక ఫైర్ ఉంటుంది. అలాంటి స్టార్ తో పవర్ఫుల్ స్టోరీ చేస్తే థియేటర్స్ పగిలిపోతాయి. ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ఆయనకి ఉంది. ఆయన ఒప్పుకోవాలేగానీ, 'శ్యామ్ సింగ రాయ్ 2'ను ఆయనతో చేస్తాను. అలాంటి పవర్ఫుల్ పాత్రలలోనే ఆయనను చూడడానికి అభిమానులు ఆసక్తిని చూపుతుంటారు" అని చెప్పాడు.
ఒక వైపున క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయనను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి హరీశ్ శంకర్ రెడీగా ఉన్నాడు. ఆ తరువాత కథను పట్టుకుని వెయిటింగులో సురేందర్ రెడ్డి ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ తో సినిమా చేయడానికి సముద్రఖని .. దేవ కట్టా లైన్లో ఉండగా, మళ్లీ రాహుల్ తయారవుతుండటం విశేషం.