CM Jagan: ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడి వివాహానికి హాజరైన సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!

CM Jagan attends MLA Katasani Rambhupal Reddy son wedding
  • నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన
  • ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘనస్వాగతం
  • పంచలింగాలలో మాంటిస్సోరీ స్కూల్ లో వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సీఎం జగన్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు శివనరసింహారెడ్డి, రూపశ్రీల వివాహానికి హాజరయ్యారు. జిల్లాలోని పంచలింగాలలో ఉన్న మాంటిస్సోరి స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు విచ్చేసిన సీఎం జగన్... వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సీఎంతో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది.

 కాగా, ఈ వివాహం కోసం కర్నూలు విచ్చేసిన సీఎం జగన్ కు ఓర్వకల్లు విమానాశ్రయంలో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, నగర మేయర్ రామయ్య తదితరులు స్వాగతం పలికారు.
CM Jagan
Katasani Rambhupal Reddy
Son
Wedding
Kurnool District
YSRCP

More Telugu News