Upasana Konidela: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఉపాసన

Upasana Konidela met PM Narendra Modi at India Expo
  • ఇండియా ఎక్స్ పో-2020 కార్యక్రమానికి ఉపాసన హాజరు
  • ప్రధానితో సమావేశమైనట్టు వెల్లడి
  • టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవాలని సూచన
ఇండియా ఎక్స్ పో-2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినట్టు కొణిదెల ఉపాసన వెల్లడించారు. ప్రధాని మోదీతో భేటీ కావడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆవిష్కరణలు, వ్యాధి నిరోధక ఆరోగ్య వ్యవస్థలు, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ ప్రధానంగా దృష్టి సారించదగ్గ అంశాలుగా ఎక్స్ పో చాటిచెప్పిందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క శక్తి ఎన్నో అవకాశాలను కల్పిస్తుందని, అయితే ఆ అవకాశాలను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని ఉపాసన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీతో సమావేశమైనప్పటి ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Upasana Konidela
PM Narendra Modi
India Expo-2020

More Telugu News